జనసేనాని పేరు మీద గుమ్మడి శ్రీరామ్ అన్నదాన కార్యక్రమం

అనకాపల్లి జిల్లా, వి మాడుగుల నియోజకవర్గం, కోటపాడు మండలం, కోటపాడు గ్రామంలో సాయిబాబా ఆలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీదగా అన్నదానం చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పేదవారికి అన్నం పెట్టారు, కౌలు రైతులకు కోటానుకోట్ల డబ్బులు ఇచ్చారు, ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది, రామరాజ్యం చేస్తారు. కొణిదెల పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని కోరుకుంటున్నామని మాడుగుల జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్ అన్నారు.