గుండ్లకట్టమంచి గ్రామ సమస్య పరిష్కారం

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, గుండ్ల కట్టమంచి గ్రామంలో మండలాధ్యక్షులు కోడి చంద్రయ్య ఆధ్వర్యంలో శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి 11-4-2023న పర్యటించినప్పుడు అక్కడి గ్రామస్థులు తమ గ్రామంలోని కొన్ని సమస్యలను రమాదేవి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. గ్రామంలోని కొన్ని వీధులలో స్ట్రీట్ లైట్స్ లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అటుగా నడిచే వారిని పురుగో, పామో కరిస్తే మా బాధ వినే దిక్కు లేదని చెప్పుకున్నారు, ఒక వ్యక్తి తన ఇంటి పైన నుండి ఎలక్ట్రిక్ పోల్ ఎక్స్టెన్షన్ వైర్ ఉండటం వల్ల తన ఇంటి పైకి వెళ్లే వారికి ముఖ్యంగా ఆడుకునే పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వాటిని తొలగించమని ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు వారిని సంవత్సరం నుండి అభ్యర్దిస్తున్నప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రమాదేవి ముందు వాపోయారు. గ్రామ సర్పంచ్ కి చెప్పినా అయన పట్టించుకోలేదని తెలియజేసారు. అక్కడి సమస్యలను తెలుసుకున్న రమాదేవి వాటి పరిష్కార దిశగా అడుగులు వేయాలని మొదటగా ఏపి ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ని కలిసి ఆ గ్రామ సమస్యలను ఆయనకు వివరంగా రాతపూర్వకంగా తెలియపరిచి, సత్వరమే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఆ మండలానికి సంబంధిత అధికారితో మాట్లాడి చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. బుధవారం గుండ్లకట్టమంచి గ్రామంలోని సమస్య పరిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వంశి కృష్ణ, మరియు కిరణ్, పవన్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.