జనసేనలో చేరిన గుండుమోగుల వీరశివాజీ

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలం, ఉనకరమిల్లి గ్రామంలో విజ్జేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ గుండుమోగుల అన్నవరం కుమారుడు, గ్రామ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండుమోగుల వీరశివాజీని నిడదవోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరాస్వామి సాదారంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజ్జేశ్వరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కోయి ప్రసాద్, గొల్లకూటి రమణ, మండలం కార్యదర్శి పిడుగు వీరబాబు, బాధానాల సూరిబాబు, మెల్ల ప్రసాద్, విజ్జేశ్వరం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.