గుంతకల్ టూటౌన్ నూతన సీఐ గణేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

గుంతకల్, నూతనంగా వచ్చిన గుంతకల్ టూటౌన్ సీఐ గణేష్ ని మర్యాదపూర్వకంగా జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్, సీనియర్ నాయకులు కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి అని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు గుంతకల్ పట్టణ జనసేన పార్టీ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రెయిన్బో టైలర్ వీరాంజనేయులు, మార్కెట్ మర్చంట్ వ్యాపారి జనార్ధన్, కలర్ ల్యాబ్ ఓనర్ హనుమంతు, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షులు పాండు కుమార్, ఆటో రామకృష్ణ, బైక్ మెకానిక్ ఆంజనేయులు, బైక్ మెకానిక్ దాదు, 60 ఫీట్ రోడ్డు వెల్డర్ రమేష్, హెచ్ బి సి ట్యాంకర్ డ్రైవర్ సూరి పవన్ కుమార్ తదితర ముఖ్య నేతలు హాజరు కావడం జరిగింది.