నాగళ్ళదిబ్బ జనసేన ఆధ్వర్యంలో సానిటైజేషన్

పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం, పొలమూరు గ్రామపంచాయతీ నాగళ్ళదిబ్బలో విష జ్వరాలతో విలవిల్లాడుతున్న ప్రజలు, గ్రామాల్లో విష జ్వరాల పీడుతుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతుంది. గ్రామ పంచాయతీ పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడం, తాగునీరు కలుషితం వంటి కారణాలతో అనేక ప్రాంతాలలో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో ఆదివారం పొలమూరు గ్రామం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు 11వ వార్డు మెంబర్ తోరం వెంకన్నబాబు అధ్వర్యంలో నాగళ్లదిబ్బ, చెన్నాడచెరువులో ప్రజలు విషజ్వరాల భారిన పడకుండా చెన్నాడచెరువు మరియు నాగళ్ళదిబ్బ ప్రాంతంలో విషజ్వరాలు అధికంగా ఉన్న కారణంగా ఆయా ప్రాంతాలలో దోమల నివారణకు మరియు వాటి వృద్ధిని నిర్మూలించడానకి ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం యొక్క ఏఈఎం లిక్విడ్ ని స్ప్రే చెయ్యడం, సానిటైజేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కందిబోయిన జగదీష్, గ్రామ కమిటీ సభ్యులు ఐరెడ్డి సత్యనారాయణ, లోకేష్ సత్తిబాబు 3వ వార్డు మెంబర్ గుండేపల్లి సుబ్బలక్ష్మి, జనసైనికులు అందే శివ, రమేష్, కొణిదెల శివ, తాడి సాయి, కందిబోయిన శ్రీను పాల్గొన్నారు.