గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది- రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

ఆత్మకూరు నియోజకవర్గం: అనంత సాగరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో గుంతల రాజ్యం ఏపీ హాష్ టాగ్, ఆత్మకూరు సోమశిల ప్రధాన రహదారిపై డిజిటల్ క్యాంపియన్ నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం పూర్తయిన ఆత్మకూరు నుంచి సోమశిల వరకు కొన్ని చోట్ల రోడ్ల దుస్థితి అడుగు గుంత గజానికి గోయిలా ఏర్పడిందని అన్నారు. ముఖ్యంగా అనంతసాగరం నుండి సోమశిల వరకు రోడ్డు చాలా అద్వానంగా ఉందని అన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. గడపగడప మన ప్రోగ్రాం ద్వారా తిరుగుతున్నారు అయినా అతని ఈ రోడ్డు చూస్తే కనబడటం లేదని ఇక్కడ స్థానిక ఉండే మండల నాయకులు కూడా దృష్టికి తీసుకొని పోయి రోడ్లు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు నరేంద్ర రెడ్డి, మహమ్మద్ రఫీ, ఎస్ దాని, అజీజ్, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.