గుంతల రాష్ట్రం- గోతుల రాష్ట్రం

  • రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ లో జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
  • ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో జనసేన, టిడిపి వినూత్న నిరసన

సత్యవేడు: రాష్ట్రంలో ఉన్న గుంతలు, గోతుల రోడ్లు రాష్ట్ర దుస్థితికి నిదర్శనంగా మారాయన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శనివారం సత్యవేడు నియోజకవర్గంలో ఆంధ్ర, సరిహద్దు బార్డర్ లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపైన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు అభివృద్దికి చిహ్నాలన్నారు.‌ కానీ ఎపిలో ఉన్న రోడ్లు రాష్ట్ర దుస్థితికి నిదర్శనమన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో తమిళనాడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతుంటే.. ఎపిలోని రోడ్లు గుంతలు, గోతులతో దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శున్యమన్నారు.‌ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన దమనకాండ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ క్యాంపైన్ లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అకేపాతి సుభాషిణి, సత్యవేడు పాయింట్ అఫ్ కాంటాక్ట్ ఇంచార్జి లావణ్య కుమార్, జిల్లా కార్యదర్శి హేమ కుమార్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత, టీడీపీ పరిశీలకులు సురేంద్ర నాయుడు, జనసేన, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.