విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు

*ముఖ్యఆతిధిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*రక్తదానం, అన్నదానం, చలివేంద్రం, సర్వమత ప్రార్ధనలు చేసిన యువత
*రక్తదాతలను అభినందించిన యశస్వి

విజయనగరం, ప్రముఖ యువనటులు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం నాడు విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రాంచరణ్ గోత్రనా మాలతో ప్రత్యేక పూజలతో పాటు సర్వమత ప్రార్ధనలు నిర్వహించి, పట్టణంలో పలు ప్రాంతాల్లో రెండువందల మజ్జిగ పేకట్లను చిరంజీవి యువత ముఖ్యనాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, దాసరి యోగేష్ పంచిపెట్టారు. అనంతరం కలక్టరేట్ కూడలిలో ఉన్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిధిగా హాజరైన జనసేన నాయకురాలు, రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ముందుగా కేక్ కట్ చేసి.. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పదని, ప్రపంచంలోనే మెగాఫ్యామిలీ అభిమానులు సేవల్లో ముందుంటారని, దీనికి నిదర్శనం ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు ఉన్నారని, ఇప్పటికే వెలకట్టలేని సేవాకార్యక్రమాలు మెగాభిమానులు చేస్తున్నారని, చిరు తనయుడు రాంచరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి అఖండ విజయం వైపు దూసుకెళ్తున్న తరుణంలో చరణ్ బాబు పుట్టినరోజు వేడుకలు జిల్లా చిరంజీవి యువత నిర్వహించడం అభినందనీయమని, జిల్లా చిరంజీవి యువత చేసే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి జనసేన ఝాన్సీ వీరమహిళ మాతా గాయిత్రి, చిరంజీవి యువత, జనసేన యువ నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, దాసరి యోగేష్, రవిరాజ్ చౌదరి, సాయి కుమార్, సూరిబాబు, రవి, కుమార్, శ్రీను, నాని, సాయి, భాస్కరరావు, వెంకీ, రవి, లాలిశెట్టి రవితేజ, అనిల్ కుమార్ మోపాడ, కిలారి ప్రసాద్, సైలాడ అనిల్ కుమార్, సాయి తదితరులు హాజరయ్యారు.