రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనపై గుంటూరు జనసేన నిరసన కార్యక్రమం

గుంటూరు: జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంభందించిన నిరసన సెగ గుంటూరు నగరాన్ని కదిలించింది.. దీనికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ కల్పించాల్సిన మంత్రులు బాధ్యత మర్చిపోయి ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్ధాంతం చేస్తున్నాయి అని మాట్లాడటం ఆయన చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చేతకాని దద్దమ్మ పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే అర్థమయి పోతుంది.. దిశ, దశ లేని జీవోలు పెట్టుకోటానికి తప్పితే ఈ ప్రభుత్వం దేనికి ఉపయోగం అని నిలదీశారు. నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. అయ్యా.. సీబీఐ దత్త పుత్రుడు గారూ మీరు ముందు ఆ ప్యాలస్ వదిలి బయటకు వచ్చి దారుణాలను చూస్తే అర్ధమవుతుంది.. 5నెలల పసికందు నుండి బాలికలకు, గర్భిణీలకు, తల్లులకు ఆఖరికి వృద్ధులకు కూడా రక్షణ లేకుండా ఉంది పరిస్థితి. మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గానే పిలుస్తున్నారు.. దీన్ని అత్యాచారాంధ్రప్రదేశ్ మార్చొద్దని కోరుకుంటూ.. ఇదే తరహాలో ఉంటే మిమ్మల్ని2024 లో తరిమి తరిమి కొడతారని తెలియచేసుకుంటున్నాము.
అనంతరం పార్వతి నాయుడు మాట్లాడుతూ.. ఇంట్లో నుండి స్వేచ్ఛగా ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి లేదు, సాక్షాత్తు హోంమంత్రి మహిళ అయ్యుండి సమస్యలు పరిష్కరించాలని కోరితే.. తలితండ్రుల మీద నిందలు వేయడం సిగ్గు చేటని తెలిపారు.. కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించమని రోడ్లెక్కి మాట్లాడాల్సిన దుస్థితి తీసుకువచ్చిన జగన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, చింత రాజు, అన్నదాసు సుబ్బారావు, కొండూరు కిశోర్, యడ్ల నాగమల్లి ఆనంద్ సాగర్, సోమి ఉదయ్, సూదా నాగరాజు, తోట కార్తిక్, సోమిశెట్టి నవీన్, తిరుమలశెట్టి కిరణ్, బోదల అశోక్, పులిగడ్డ గోపి, బండారు రవీంద్ర,త్రిపుర, లక్ష్మిశెట్టి నాని, పమిడి పవన్..వీర మహిళలు కటకంశెట్టి విజయలక్ష్మి, యడ్ల తిరుపతమ్మ, పాకనటి రమాదేవి, జంగం మల్లీశ్వరి, కవిత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.