మౌలాలి దర్గా గంధ మహోత్సవంలో పాల్గొన్న గునుకుల కిషోర్

కోవూరు నియోజకవర్గం, మౌలాలి దర్గా గంధ మహోత్సవంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ దర్గా నిర్వహకుల ఆహ్వానం మేరకు గంధ మహోత్సవంలో పాల్గొని పీఠాధిపతులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలందరూ బాగుండాలని జరిపే గంధ మహోత్సవంలో పాల్గొనటం సంతోషదాయకం. ప్రతీ ఏటా జరిగే పీర్ల పండుగలో తన పేరుపై కూడా ఒక పీరు ఉండడానికి గుర్తు చేసుకుంటూ అమ్మి ఎలా ఉందని ప్రతీసారి ఆప్యాయంగా ఆమ్మ అమీర్ జాన్ పలకరింపు, చల్లని స్పర్శ మరువలేం. కులమతాలకతీతంగా భక్తజనులు ఇక్కడికి వచ్చి నిప్పుల గుండం తొక్కడం చిన్ననాటి నుండి ఇక్కడకు వచ్చి చూసేవాడివని అమీర్జాన్ గుర్తు చేశారు. ఈ వయసులో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్గా నిర్వహిస్తున్న ఆమెకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియు పీఠాధిపతులు భక్త జనులతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షారూ, ఖాసిఫ్, నవీన్, షేక్ ఇమ్రాన్, అమీర్ జాన్, షారుక్, మెహబూబ్, మునాఫ్, జమీర్, రఫీ, వహీద్ తదితరులు పాల్గొన్నారు.