జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన గురుదత్

రాజానగరం: నియోజకవర్గంలో పలు గ్రామాల క్రియాశీలక వాలంటీర్స్ కు గురువారం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ క్రియాశీలక కిట్లు పంపిణీ చేసారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అండగా వుండే విధంగా కార్యకర్తల క్షేమం కోసం అమలులోనికి తెచ్చిన 5లక్షల ప్రమాద భీమాతో కూడిన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి అధిష్టానం ఆదేశాల మేరకు పలు గ్రామాల క్రియాశీలక వాలంటీర్స్ కి కిట్లను మేడ గురుదత్ ప్రసాద్ అందజేసారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కో-కన్వీనర్ నగవరుపు భానుశంకర్ తదితరులు పాల్గొన్నారు.