ఘనంగా జెట్టి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

  • నా సేన కోసం.. నా వంతు 25 వేల విరాళమిచ్చిన జెట్టి
  • మా పార్టీ అధ్యక్షులు వారు తలపెట్టిన ఎలాంటి కార్యక్రమానికైనా మా నాయకులు, కార్యకర్తలు ముందుండి నడిపిస్తారు
  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, తూర్పు నియోజకవర్గం నాయకులు జెట్టి శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… మా పార్టీ నాయకుడు జట్టి శ్రీనివాసరావుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన “నా సేన కోసం.. నా వంతు” కార్యక్రమానికి తన జన్మదినం సందర్భంగా తనవంతుగా 25,000/- రూపాయల చెక్కుని నాకు అందజేసినందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గాని ఇలాంటి ఒక విశేషమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అలాంటి రోజు మనము ఖర్చుపెట్టి ధనాన్ని పార్టీకి ఎంతో కొంత ఇలా సహాయ చేయాలని కోరారు. మనము పార్టీకి ఖర్చు పెట్టె ప్రతి రూపాయి పేదవాడికి అందే విధంగా అధ్యక్షుల వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 3000 మంది కౌలు రైతులకు మన అధ్యక్షులు వారి కుటుంబానికి చేస్తున్న ఆర్ధిక సహాయమే ఒక గొప్ప ఉదాహరణగా అందరూ గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, ముమ్మలనేని సతీష్, యడ్ల.నాగమల్లి, పాండురంగారావు, అందే వెంకటేశ్వరరావు, జడ సురేష్, తన్నీరు గంగరాజు, తుమ్మల నరసింహారావు, దాసరి వెంకటేశ్వరరావు, కట్టా అనిల్, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.