హంద్రీనీవా నీటిని మార్చి వరకు విడుదల చేయాలి.. ఆలూరు జనసేన రాస్తారోకో

ఆలూరు: మార్చి వరకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని నియోజకవర్గ జనసేన నాయకులు తేర్నేకల్ వెంకప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దేవనకొండ-కర్నూలు రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా తెర్నేకల్ వెంకప్ప మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గం భవిష్యత్తు రిజర్వాయర్లతోనే ముడిపడిఉందని.. సమీప భవిష్యత్తులో ఆలూరు నియోజకవర్గ రైతంగాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఐక్యత చేసి ముందుకు తీసుకెళ్తాం అని తెలియజేస్తూ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జయరాం గడప గడప కార్యక్రమంలో మార్చి వరకు హంద్రీనీవా నీరు వస్తుందని పంటలు వేసుకోండని చెప్పడంతో రైతులు వేలాది ఎకరాల్లో వేరుసెనగ మరియు మిరప పంటలు సాగు చేశారన్నారు. హంద్రీనీవా అధికారులు మాత్రం డిసెంబర్ వరకు మాత్రమే నీటి పంపిణీ ఉంటుందని ప్రకటన ఇవ్వడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా ఉందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టి ఇన్చార్జి తహసీల్దార్ సుదర్శనంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మక్బూల్, బడేసాబ్, సరోజ, ఆంథోని, నందు, రామలక్ష్మన్న, నాగరాజు, రైతులు, మహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.