ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు: చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: ఆదివాసి దినోత్సవం సందర్బంగా బుధవారం నాతోటి గిరిజనులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జనసేన పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అడవిలో కొండల్లో అడవితల్లిని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా తమ సంప్రదాయాలు కాపాడుకుంటూ కల్లా కపటం ఎరుగని గిరిపుత్రులు, దేశం ఎంత ముందుకు పోతున్న నేడు విద్యా, వైద్యం, ఇల్లు ఈ మూడు విషయాల్లో ఇంకా వెనకబడే ఉన్నారు. అడవి తల్లిని, సకల జీవులను దైవంగా భావించే గిరిపుత్రుల ఉనికి నేడు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వం నడుచుకునే తీరు దారుణమైంది. అనారోగ్య సమస్యలు, స్త్రీలకు ప్రసవానికి ఆసుపత్రులకు వెళ్ళాలి అన్నా ఎన్నో కష్టాలు, అవంతరాలు ఎదుర్కుంటున్నారు. దోపిడిదారులు, నాయకులు దోచుకుంటున్నారు. అత్యవసర ఆరోగ్య సమయాల్లో దగ్గర్లో ఆసుపత్రులు లేక ప్రాణాలు కోల్పోయినవాళ్ళు ఎందరో.. 6కి.మీ. హెలికాప్టర్లో ప్రయాణం చేసే వారికి ఏం తెలుస్తుంది గిరిపుత్రుల భాద..? గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఐ.టి.డి.ఏ లను మరింత సమగ్రంగా పటిష్టం చెయ్యవలసిన భాద్యత ప్రభుత్వం మీద ఎంత అయినా ఉంది. భరోసాగా పెద్దన్న పాత్ర వహించాల్సిన ఐ.టి.డి.ఏ ఇప్పడు అధికార నాయకులకు ఎందుకు ఆసరాగా ఉంటుంది..? ఈ వ్యవస్థ మారాలి, గిరిజనులకు న్యాయం జరగాలి.. ఇందుకు సమర్థనాయకత్వం కావాలి. గిరిపుత్రులు చదువుకోవాలి, అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నానని చిర్రి బాలరాజు పేర్కొన్నారు.