ఘనంగా మన్నెం శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

పర్చూరు, మన్నెం శ్రీకాంత్ జన్మదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయాన్నే మెగా ఫ్యామిలీ శ్రీకాంత్ ఫ్యామిలీ పేరు మీద శ్రీ పావులూరు ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేయించడం జరిగింది. అనంతరం ఇంకొల్లు మండలంలో ఈడుపులపాడు గ్రామంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పర్చూరు మండలం నూతలపాడు వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు, ఇంకొల్లు మండలం అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రహీమ్, యాద్దానపూడి మండలం అధ్యక్షులు అయ్యప్ప, చక్రి, పవన్, రవి, జ్యోతి, సాయి, కుప్పాల మహేష్ పాల్గొన్నారు.