ఓ మన్యం వీరుడా! అందుకో మా వందనములు!: బండారు శ్రీనివాస్

*అల్లూరి సీతారామరాజు ఆశయాల కోసం నిజాయితీపరుడైన మా జనసేనానితో కలిసి ఎంత దూరమైనా నడుస్తాం!: బండారు శ్రీనివాస్

కోనసీమ జిల్లా: శనివారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా.. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలియజేసారు. ఒక గొప్ప దేశభక్తుడు, దేశం కోసం, మన్యం ప్రజల కోసం, బ్రిటిష్ వారిని ఎదిరించి, ఎంతో ధైర్యసాహసాలతో.. మన్యం ప్రజలలో ఒక ధైర్యం నింపిన గొప్ప దేశభక్తుడని.. తన ప్రాణాలను సైతం లెక్క చేయలేయని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు, వందనాలు సమర్పిస్తామని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా నీతి నిజాయితీలతో నడిచే గొప్ప నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి అల్లూరి సీతారామరాజు ఆదర్శం అని ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు వారి ఆశయాలతో నడుస్తున్న జనసేనాని నాయకత్వంలో జనసేన పార్టీ తరఫున మన్యం వీరుడకు ఈ వర్ధంతి సందర్భంగా బండారు శ్రీనివాస్ శ్రీ సీతారామరాజుకు ఘనంగా నివాళులు తెలియజేశారు.