క్రిష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాధా కృష్ణ జాగర్లమూడి అదేనండి మన క్రిష్ ఈరోజు తన 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీ పుత్ర శాతకర్ణీ, ఎన్టీఆర్ వంటి సినిమాలతో తన ప్రతిభను చూపారు. అంతేకాకుండా టాలీవుడులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. దాంతో పాటుగా బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును రెండు సార్లు, నేషనల్ ఫిల్మ్ అవార్డును, నందీ అవార్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ రోజు ఇతని పుట్టిన రోజు సందర్భంగా ఎందరో ప్రముఖ నటులు, ఇతర డైరెక్టర్లు, సినీ పరిశ్రమ క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు అతడి అభిమానులు ట్వీట్ల వెల్లువ కురిపించి అతడిపై వారి కున్న అభిమానాన్ని చాటుకున్నారు.