శ్రీ చేగొండి హరిరామజోగయ్యకి జన్మదిన శుభాకాంక్షలు

దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, హోమ్ శాఖ మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వర్తమాన రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు హరిరామజోగయ్య గారు తగిన సూచనలు అందిస్తూ ఉంటారు. వారికి నిండు సంతోషాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.