బోనాల శుభాకాంక్షలు: నేమూరి శంకర్ గౌడ్

  • బోనాల పండుగ పోస్టర్‌ ఆవిష్కరణ

కూకట్పల్లి నియోజకవర్గం: బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మరియు కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలంగాణ రాష్ట్ర మరియు కూకట్పల్లి జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ శుక్రవారం జనసేన కార్యాలయంలో జనసేన తరపున బోనాల పండుగ పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా చేసుకునే పండుగ బోనాల పండుగ. ఆషాడ మాసంలో చేసుకునే అమ్మవారి పూజలను తెలంగాణ ప్రజలు ఘనంగా భక్తిశ్రద్ధలతో చేసుకొని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కూకట్పల్లి నాయకులు కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, వేముల మహేష్, సునీంద్ర, పవన్ గౌడ్, శివారెడ్డి ఇతరులు పాల్గొన్నారు.