గురు పౌర్ణమి శుభాకాంక్షలు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ మాట్లాడుతూ.. బుధవారం గురు పౌర్ణమి సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. పుట్టగానే అమ్మ అని పిలుపు నెరిపిన అమ్మ ఒక గురువు.. నడక నేర్పిన నాన్న ఒక్క గురువు.. తప్పులు చేస్తే సరిదిద్దినటువంటి స్నేహితులు ఒక గురువు.. నాలాంటి యువత కి ఎంతోమంది నాయుకులుకి ఈ రోజు వైస్సార్సీపీ లో ఉన్నటువంటి ఎంతోమంది ఎంపీలకు రాజకీయ అవకాశం ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర కలిగిన కొణిదల చిరంజీవి గారికి.. అలాగే ప్రతి ఒక్క యువత ఆడుతూ పాడుతూ ఉండే యువకులలో సామాజిక బాధ్యతలు నేర్పుతూ రాజకీయ భవిష్యత్ ఇస్తున్న శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి.. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారు.. భారతదేశం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు గురువునే.. డాక్టర్స్, లాయర్స్, పాత్రికేయులు ఇలా ప్రతి ఒక్కరు గురువులే.. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి బాధలో ఉన్నా ఓడిపోతున్న ప్రతీసారి మనసుని దృఢంగా చేస్తూ.. మనోధైర్యం ఇస్తూ మనల్ని సరికొత్తగా నడిపిస్తున్న నా దైవం కూడా ఒక గురువునే.. దైవ దీవెనలు ఉండాలి అని మనసారా కోరుకుంటున్న గురువులు అందరికి జనసేన జానీ నమస్కారాలు తెలియజేసారు.