తల్లిగా.. గృహిణిగా మహిళలు అందించే సేవలు అమూల్యమైనవి..వెల కట్టలేనివి: పవన్ కళ్యాణ్

భూమితోపాటు సమస్త ప్రకృతినీ స్త్రీమూర్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తారు మన భారతీయులు. మాతృదేవో భవ అని దైవంగా పూజిస్తాం. అటువంటి స్త్రీమూర్తులను ప్రత్యేకంగా గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీ నాడు మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే- వారు రాణించని రంగమంటూ ఉండదంటే అతశయోక్తి కాదు. తల్లిగా.. గృహిణిగా ఆమె అందించే సేవలు అమూల్యమైనవి… వెల కట్టలేనివి. ఈ మహిళా దినోత్సవం శుభ తరుణాన స్త్రీమూర్తులు అందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.