వర్ష బీభత్సం.. సహాయం కోసం ఫోన్ చెయ్యవలసిన నంబర్లు

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఈ క్రమంలోనే ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న హైదరాబాద్‌కూ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేయగా.. హైదరాబాద్ నగరంలో వర్ష బీభత్సానికి హిమాయత్‌ సాగర్‌లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం మునిగిపోయేలా కనిపిస్తుంది.

హిమాయత్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో జలమండలి అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. 1300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. నీటిని విడుదల చేస్తుండగా.. మూసీ పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరో రెండు రోజులు జీహెచ్‌ఎంసీ పరిధిలో అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్‌ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. 90కి పైగా విపత్తు బృందాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

అత్యవసర సహాయం కోసం ఫోన్ చెయ్యవలసిన నంబర్లు

1) జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఫోన్: 9000113667

2) GHMC అడ్డంగా పడిన చెట్లు నరికేందుకు ఫోన్: 6309062583

3) water loging ఫోన్:9000113667

4) ఎలక్ట్రిక్ కంట్రోల్ ఫోన్:94408 13750

5) N. D. R. F ఫోన్: 8333068536

6) M.C.H డిజాస్టర్: ఫోన్: 97046018166