మాండూస్ తుఫాను బాధిత రైతులను ఆదుకోండి: నల్లల రామకృష్ణ

మాండూస్ తుఫాను దెబ్బకు నష్ట పోయిన రైతులకు ప్రభుత్వము సత్వరమే నష్ట పరిహారం అందించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నల్లల రామకృష్ణ డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర మండలాల్లో కూడా వందలాది హెక్టార్ల విస్తీర్ణంలో వరి పన మీద ఉండగా తడిసి పోవడం జరిగింది. కొన్నిచోట్ల ధాన్యం కుప్పలుగా పోసి ఉండగానే ఈ తుఫాను రావడం తో అడుగుపొర మొత్తం మొలకలు రావడం, రాశి తడిసిపోయి మరలా ఆరబెట్టాల్సి రావటం వల్ల రైతు కు ఖర్చులు పెరిగి మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టుగా అయింది. అంతేకాకుండా రెండు రోజులు పాటు వచ్చిన వర్షాలు వలన తడిచిన వరిని రైతు తిరిగి ఆరబెట్టడానికి అయ్యే ఖర్చు అదనంగా పెరిగి రైతుకు నిరాశకు గురి కావటం జరుగుతుంది. అయితే మెట్ట ప్రాంతంలో ధాన్యపు పంట అసలే అంతంత మాత్రంగా ఉత్పాదకత ఉంటుంది. కాబట్టి రైతులకు దాన్యం ఆరబెట్టడానికి అయిన అదనపు ఖర్చు మొత్తం ఆయా రైతులకు పనికి ఆహార పథకం ద్వారా మస్తర్ వేసి రైతులకు ప్రభుత్వము తక్షణమే ఉపశమనం కల్పించాలి. అంతేకాకుండా తడిచిన ధాన్యం గ్రేడింగ్లతో సంబంధం లేకుండా తేమ శాతం పేరుతో వంకలు పెట్టకుండా మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం రైతులు వద్ద నుంచి కచ్చితంగా తీసుకోవాలి. తీసుకునే క్రమంలో ప్రభుత్వ నియమాలు అనుగుణంగానే వ్యవహరించాలి తప్ప సేకరణలో తేమ కు నష్టపరిహారంగా అదనపు ధాన్యాన్ని రైతుల నుండి మిల్లర్లు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రైతులు కు తుఫాను నష్టాన్ని ప్రకటించి వెంటనే ఇప్పించి వారిని వడ్డీలు బారినుండి తప్పించాలి. అంతేకానీ తూ..తూ.. మంత్రపు చర్యలతో ప్రభుత్వము చేతులు దులుపుకోవాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదు.