సమాజంలో ఉన్న సామాజిక వర్గాలకి చేయూత ఇవ్వాలి

కాకినాడ సిటి: కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ పత్రికావిలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గతకొన్ని రోజులుగా తాను ప్రత్యక్షంగా కలిసిన వివిధ వర్గాల కుటుంబాల ఆవేదనలని అర్ధం చేసుకుని వాటి పరిష్కార పోరాటానికి సమాయుత్తమవుతూ వాటిపై గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గత పర్యటనలో మూడురోజులు కాకినాడ సిటిలో బసచేసినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా తాము ప్రయత్నాలు చేసామన్నారు. సమాజం అంటే అన్ని కులాల సమూహం అనీ, సమాజంలో ఉన్న రకరకాల సామాజిక వర్గాలకి చేయూత ఇవ్వాలిసిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంటుందనీ కానీ కొన్ని కులాలకే ఇది జరుగుతొందనీ, అందరికీ అందచేయాలనీ ఆ పెద్దలని కలవమని ఆదేశాలు ఇచ్చారనీ దానిప్రకారమే కాకినాడలో అన్ని కులవృత్తుల వారినీ కలవడం జరిగిందన్నారు. కుమ్మరి, రజక, విశ్వకర్మ, మేదరి, బ్రాహ్మణ మొదలగు అన్ని కులవృత్తుల వారినీ కలవడం జరిగిందన్నారు. ఆనాడు జంగన్మోహన్ రెడ్డి గారు ఈ కులవృత్తుల వారందరికీ పించను మూడువేలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటివరకూ ఏమిచేసారు. అధికారంలోకి వచ్చి నాలుగుసంవత్సరాల తొమ్మిదినెలలూ గడిపేసి మూడునెలలలో కుర్చీ దిగిపోయేముందు కేవలం వృద్ధులకి మాత్రమే ఇస్తూ గొప్పలు చెపుతున్న ఈ ముఖ్యమంత్రి మిగిలిన వర్గాల పించనులను ఎందుకు వీటితోపాటూ పెంచలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. పైగా ఈరోజు కాకాడ సభలో మాట్లాడుతూ ఈ రాబోయే 60 రోజులలో బొలుడన్ని మాయమాటలు చెపుతారు, మోసపూరిత వాగ్దానాలు చెపుతారని అన్నారనీ ఇంతకన్నా హాస్యాస్పదం మొరోటిలేదన్నారు. పైగా మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిగారికి జగనన్న కోలనీల వ్యయంలో అవినీతి జరిగింది దీనిపై కేంద్ర దర్యాప్తుసంస్థతో దర్యాప్తు కోసం లేఖ రాస్తే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాకినాడలో కూడా తాము సి.ఐ.డి కి దర్యాప్తు చేయాలని లేఖని ఇస్తామన్నారు. మా నాయకుడిని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఆడిపోసుకుంటున్నారనీ, మీకిదే చెపుతున్నాం అవును తమనాయకుడుని ఈ కాకినాడలోనే రెల్లికులస్తులు దత్తతతీసుకున్నారనీ, అప్పటినుండీ పేద వెనుకబడిన రెల్లికులానికి దత్తపుత్రుడు అనీ, ఇప్పుడు రజక, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి కులాలు కూడా పవన్ కళ్యణ్ గారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాయన్నారు. 30 వేలమంది కౌలు రైతులను దత్తత ఈయన తీసుకున్నారనీ, కాబట్టి ఒక్కటే చెపుతున్నాం దత్తత అన్నది ఈ వై.సి.పి ముఖ్యమంత్రి, ఇక్కడి శాశనసభ్యుడు తెలుసుకోవాలన్నారు. దత్తత అన్నది ఒకమనిషిని సొంతంచేసుకునేది అని అంత గొప్ప పదాన్ని దిగజారిచి మాట్లాడుతున్నారన్నారు. ఈ సమావేశంలో నగర ఉపాధ్యకులు అడబాల సత్యన్నారాయణ తోపాటు కుమ్మరి నాయకులు దాలిపర్తి వి.వి కుమారు, రజక నాయకులు నరం మణికంఠ, విశ్వబ్రాహ్మణ నాయకులు ఎం.బద్రి పాల్గొన్నారు.