ధ్వజ స్తంభం ప్రతిష్ఠ సందర్భంగా బొలియశెట్టి దంపతులు సహాయం

కొండపల్లి మున్సిపాలిటీ కొత్తగేట్ లో శ్రీ సంజీవాధ్రి ఆంజనేయ స్వామి వారి ధ్వజస్తంభం, శనైశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు రావు కేతువులు ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా.. శనివారం రోజు అన్నదానం కార్యక్రమానికి జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, విజయదుర్గ దంపతులు 2116/- రూపాయలు, 50 కిలోల బియ్యం, 10 కిలోల కందిపప్పు కొత్తగేట్ ఆంజనేయ స్వామి గుడి కమిటి సబ్యులు రామాంజనేయులు, హరికృష్ణ, రామకృష్ణ లకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ తోని కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు అందరూ బాగుండాలని ఆయు,ఆరోగ్య, ఐశ్వర్యం ప్రసాదించాలని ఆంజనేయ స్వామి వారిని భక్తితో మనస్సుపూర్తిగా వేడుకొంటున్నానని తెలియజేసారు.