జనసేనానికి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంచాలని సర్వేపల్లి జనసేన డిమాండ్

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం గొల్లమూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ కి రెక్కీ జరగడానికి కారకలు ఎవరు? ఇటీవల వైజాగ్ లో జరిగిన ఘటన తర్వాత ఇటువంటి పరిణామం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంపైన అనుమానాలు వస్తున్నాయి. చీమ చిటిక్కుమన్నా సరే జనసైనికులు చూస్తూ ఊరుకోమన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ కి ఏర్పాటు చేయాలని అదేవిధంగా సెక్యూరిటీ పెంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నానని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమైనది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మా అధినేతకి జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణపతి, శ్రీహరి, పినిశెట్టి మల్లికార్జున్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.