గుంటూరు జనసేన కార్యాలయంలో వీరమహిళల సమావేశం

గుంటూరు: జిల్లా మహిళా మీటింగ్ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. మీటింగ్ యొక్క ముఖ్యాంశాలు.. రేపు జరగబోయే ఎలక్షన్లలో జనసేన పార్టీ నుంచి మన వీరమహిళల పాత్ర ఏవిధంగా ఉండాలి. ఇప్పటివరకు అధిష్టానం పిలుపుపై కానీ జిల్లాలో సమస్యలపై కానీ ఎలాంటి పోరాటంలో అయినా ముందు ఉండి ఆ కార్యక్రమాన్ని కానీ ధర్నాని కానీ విజయవంతం చేయుటలో ముఖ్య భూమిక పోషించింది మా వీర మహిళలే అని గర్వంగా చెబుతాను. మా వీర మహిళలను చూస్తే మరి ముఖ్యంగా మన జిల్లాలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను ఎప్పుడూ పిలుపు ఇచ్చిన అది రోజులు కావచ్చు గంటల వ్యవధిలో కావచ్చు వెంటనే స్పందించి ముందుకు వస్తారు కాబట్టి మీరు ఉన్నారని ధైర్యంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది.. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రేపు ఎలక్షన్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న వాటిని తుచా తప్పకుండా మనమందరం ఆ నిర్ణయాని శిరసా వహించల్సిందే. మండల, గ్రామ స్థాయిలో మన పార్టీనీ బలో పేతం చేయాలని ఆ బాధ్యత మన అందరపై ఉంది అలాగే మరీ ముఖ్యంగా వీరమహిళలపై చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా వింగ్ కోఆర్డినేటర్ పార్వతీ, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా కమిటీ సభ్యులు బిట్రగుంట మల్లిక, తులసి కుమారి, బంధనాల జ్యోతి, రావి రమ, బడే కోమలి, అనురాధ, అధికార ప్రతినిధి రజిని మరియు జిల్లా వీరమహిళలు.