ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతించింది. ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితి ఉందని.. ఎన్నికలు నిలిపివేయాలంటూ పలువురు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలు నిలివేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఫలితాల వెల్లడికి పచ్చజెండా ఊపింది.