ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్.. స్థానిక ఎన్నికలపై నో ‘స్టే’

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న ట్విస్టుల సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలు నిర్వహిస్తామని తొలుత వైఎస్ జగన్ సర్కార్ ముందుకెళ్లగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అర్ధాంతరంగా ఆపేశాడు. ఆ తర్వాత ఎంత కథ అందరికీ తెలిసిందే.. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించడానికి పూనుకున్నాడు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా లేమంటూ తేల్చిచెప్పింది.

ఇలా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్థానిక ఎన్నికలపై రగడ సాగుతూనే ఉంది. తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం కుదరదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరగా అందుకు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కౌంటర్ ను దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషనర్ కు సూచించింది.