చరిత్ర క్షమించని రీతిలో వైసీపీ రాక్షస పాలన

  • నియంత పాలనలో ప్రజాస్వామ్యం విలవిలలాడుతుంది
  • అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ దాష్టీకాలతో నరకయాతన పడుతున్నారు
  • నమ్మి అండగా నిలిచిన దళితులను, ముస్లింలనూ వదలని వైసీపీ సైకోలు
  • రాష్ట్ర ప్రజలకు ఆపద్భాంధవుడిలా పవన్ కల్యాణ్
  • అమ్మలాంటి లాలన – పవన్ కల్యాణ్ పాలన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: చరిత్ర క్షమించని రీతిలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఒక కీచకుడి చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద అమ్మలాంటి లాలన – పవన్ కల్యాణ్ పాలన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైకో పోవాలి – సంకీర్ణం రావాలి ప్రజా కంఠకుడు పోవాలి – ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విలవిలలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఏ క్షణాన ప్రమాణస్వీకారం చేసాడో అప్పటినుంచి రాష్ట్రం రావణకష్టంగా మారిందన్నారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలూ నరకయాతన పడుతున్నారని దుయ్యబట్టారు. చివరికి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులను, ముస్లిం మైనారిటీలను సైతం జగన్ రెడ్డి నయవంచన చేశాడని మండిపడ్డారు. తన అసమర్ధ పాలనతో అన్ని వ్యవస్థలను కునారిల్లింపచేసిన చేసిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదేనని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా, గంజాయాంధ్ర ప్రదేశ్ గా, మాదకద్రవ్యా0ధ్ర ప్రదేశ్ గా, అడబిడ్డలకు రక్షణ లేని రాష్ట్రంగా మార్చిన జగన్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆపద్భాంధవుడిలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ కు పదవులపై వ్యామోహం లేదని, డబ్బుపై ఆశ అసలే లేదన్నారు. ప్రజలు, దేశం తప్ప మరో వ్యాపకం లేని పవన్ కల్యాణ్ నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కష్టం వస్తే అమ్మలా అక్కున చేర్చుకుంటున్నాడని, నష్టం కలిగితే తండ్రిలా ఆదుకుంటున్నాడన్నారు. రాష్ట్ర ప్రజలు పవన్ కల్యాణ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో జనసేనకు భారీ మెజారిటీతో పట్టం కట్టనున్నారని ఆళ్ళ హరి అన్నారు. అనంతరం గోడప్రతులను డివిజన్ లోని పలు ప్రాంతాల్లో అతికించారు. కార్యక్రమంలో రెల్లి యువత సోమి ఉదయ్ కుమార్, బాషా, కోలా అంజి, సుబ్బారావు, అలా కాసులు, రేవంత్, తేజ, బాలకృష్ణ, చిన్న, చిరంజీవి, తాడికొండ శ్రీను, హరీష్ తదితరులు పాల్గొన్నారు.