విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో గౌరవం దక్కేలా జనసేన కృషిచేస్తుంది: వాసగిరి మణికంఠ

గుంతకల్, శ్రీ చైతన్య విభిన్న ప్రతిభావంతుల మండల సమాఖ్య వారు డిసెంబర్ 6వ తారీకున గుంతకల్ పట్టణంలో నిర్వహిస్తున్న “అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం”నకు ముఖ్యఅతిథిగా గుంతకల్ నియోజకవర్గం జనసేన – టిడిపి సమన్వయ బాధ్యులు వాసగిరి మణికంఠని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ తన వంతు బాధ్యతగా వారిని ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం రాబోయే రోజుల్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో గౌరవం దక్కేలా మరియు వారి సమస్యలను జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రతి విషయంలోనూ జనసేన పార్టీ అండగా ఉండేలా కృషి చేస్తుందని భరోసాని ఇచ్చారు.