పరుగు పందెంలో గెలవడం కోసం గుర్రం వాడాలి.. గాడిదలను కాదు: జనసేన మురళి

అనంతగిరి: అనంతగిరి జనసేన నాయకులు జనసేన మురళి మాట్లాడుతూ.. ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు కలసి ఎస్టీ జాబితాలో బోయ/వాల్మీకులను చేర్చేందుకు నివేదిక తీర్మానం చేసి సిఫారసు చేయడం జరిగిందని, స్వయముగా సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. మన గిరిజనులతో చెప్పులు నాకి, డబ్బులు ఆశ పెట్టి, తనతో తిప్పుకుని, అరకు, అనంతగిరి ఏరియాలో, మైనింగ్ మాఫియా భినామి గిరిజన గంజాయి గ్యాంగ్ లు పెట్టుకుని తిరుగుతూ, పామ్ హౌసెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, చేస్తూ సరైన సమయంలో పార్టీకి డబ్బులు ఎరచూపి, పార్టీ డొనేషన్ కట్టి గిరిజన ప్రాంతం నుండి ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి ఎక్కడో ఒక పల్లపు ప్రాంతము షెడ్యూల్డ్ తెగ (ప్లేఇన్ ఎస్టీ) ఎలుకలు పట్టే షెడ్యూల్డ్ తెగ అయిన కుంభ రవిబాబు గిరిజన ద్రోహి అయ్యాడు. మన జాతికే దెబ్బకొట్టాడు. అసలు విడేవడయ్యా నివేదిక తీర్మానం ఇవ్వడానికి నాన్ ట్రైబల్ బోయ/ వాల్మీకులతో పోల్చుకుంటే స్థితిగతులు, సామాజిక, ఆర్ధిక, భౌగోళిక, భాష, సంప్రదాయాలు బిన్నంగా ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డలతో పోల్చి ఎస్టీ జాబితాలో పెట్టడానికి..! ఆదివాసీ గిరిజన ద్రోహి.. వీడికింద పనికిమాలిన ఎస్టీ కమిషన్ సభ్యులు ద్రోహులు మత్యారస విశ్వేశ్వర రాజు వంటి వారు కొంతమంది ఉన్నారు. అసలైన గిరిజనుల జాతికే ద్రోహం చేశారు. చైర్మన్ రవిబాబు, కమిషన్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజా దోపిడీ ప్రతినిధుల ఇంటి ముట్టడి చేసి బుద్ది చెప్పాలి. కుంభ రవిబాబు ఇప్పుడు ఏకంగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. కుంభ స్థలం కొట్టేశాడు. వీరిని మనం తరిమి కొట్టాలి, ఇంకో ఏడుగురు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, విశ్వాసారాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, నాగుల పల్లి ధనలక్ష్మి, తెల్లం బాలరాజు, పిడిక రాజన్న దొర, చెట్టి ఫాల్గుణ గిరిజన ఎమ్మెల్యేలు వీరికి కూడా బుద్ది చెప్పాలి. అందుకే ఈ సారైనా పరుగు పందెంలో గెలవడం కోసమే గుర్రం వాడాలి, గాడిదలను కాదు బ్రదర్ అని జనసేన మురళి ఏద్దేవా చేసారు.