పంచదార చినబాబుకు ద బెస్ట్ సోషల్ సర్వీస్

రాజోలు, బుధవారం సాయంత్రం 5 గంటలకు పొదలాడ గ్రామంలో శుభం గ్రాండ్ నందు కింగ్స్ ఫౌండేషన్ నేషనల్ వైడ్ వారి ఆధ్వర్యంలో ది లెజెండ్ అవార్డ్స్ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం జరిగినది. పొదలాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు పంచదార చినబాబుకు ద బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు. ఇదే గ్రామానికి చెందిన పెసింగి సచిన్ కు వండర్ కిడ్ అవార్డును మరియు 5వేల రూపాయల నగదును రాజోలు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గుబ్బల రోజా రమణి మవోహర్ అందించటం జరిగినది. ఈ కార్యక్రమంలో కింగ్స్ ఫౌండేషన్ నేషనల్ వైడ్ బోర్డుమెంబర్ జాలెం శ్రీను, ముఖ్యనాయకులు లిఖితపూడి బుజ్జి, కంబాల చంద్రరావు, గెడ్డం సురేష్, కొల్లాబత్తుల సతీష్ బాబు, పెసింగి సత్యనారాయణ, కంబాల జగదీష్, సూరంపూడి రామకృష్ణ, నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల సతీష్, మామిడిశెట్టి కృష్ణ, గెల్లి స్వామి, జాలెం శ్రీనివాసరావు, పెసింగి సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.