చెరువుకి పడ్డా గండే పూడ్చలేనివాళ్లు ఇక సంగమేశ్వరం ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారు…?

*పెరికపాలెం రైతు ఆత్మహత్యకు కారణం వైసిపి నాయకుల నిర్లక్ష్యం కాదా…?
*5 కోట్ల రూపాయలు ఎక్కడ దాచి పెట్టారు “మాదాసు వెంకయ్య”…?
*ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైంది…?

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డిపాలెం మరియు రామన్నపాలెం మధ్య ఉన్నటువంటి “పెద్ద చెరువు” దగ్గరకు పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” పర్యటించడం జరిగింది.ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దాదాపు 10 ఊర్ల రైతులకు ఈ పెద్ద చెరువు ఆయువుపట్టుగా ఉంది, 10 ఊర్లు, 1500 ఎకరాలు, 1000 కుటుంబాలు, ఈ “పెద్ద చెరువు” మీద ఆధారపడి రైతులు జీవిస్తున్నారు, ఈ చెరువు కట్టతెగిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ రోజుకి ఎవరూ దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం మాత్రమే, నాడు పాదయాత్రలో రైతులకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన జగన్, అధికారంలోకి రాగానే కార్పొరేటర్ల కొమ్ము కాస్తూ రైతులను పట్టించుకోవడం లేదు, అధిక వర్షాలు పడటం వల్ల తెగిపోయిన ఈ చెరువు కట్టను తిరిగి నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది, చెరువుకు పడ్డ గండే పూడ్చలేని వాళ్ళు ఇక సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కడతారు…? ఇది కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు, అని ప్రజలకు అర్థమవుతుంది, సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి 5 కోట్లు జగన్ ఇచ్చారని స్వయంగా మాధాసు వెంకయ్య గరు ప్రతి మీటింగులో చెబుతున్నారు, మరి 5 కోట్లు ఎక్కడ…?
సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ…?
5 కోట్లు తీసుకురావడానికి మీ కార్లో పట్టడం లేదా…?
మీ సూట్ కేసులో నిండటం లేదా…?
లేక మీ అకౌంట్లో నుండి బయటకు రాను అంటున్నాయా…?
లేక మీ జేబులోనే పర్మినెంట్ గా ఉండాలి అంటున్నాయా…?
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైంది…? ఈ పెద్ద చెరువుని పట్టించుకోరా…? గండి పూడ్చరా…? ఈ పెద్ద చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నా పెరిగిపాలెం రైతు ఆత్మహత్యకు కారణం ఈ వైసీపీ ప్రభుత్వం కాదా…?
అధికారులు మరియు నాయకులు ఇకనైనా మేల్కొని ఈ “పెద్దచెరువు” ని గండి పూడ్చి, తూముని ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని “జనసేన పార్టీ” నుండి మేము డిమాండ్ చేస్తున్నాం, అతి తొందరలో కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఖాజావలి, సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీను, వేణు, కోటి, మనోజ్, మధు మొదలైన వారు పాల్గొన్నారు.