హెలికాఫ్టర్ సీఎంకి రోడ్ల దుస్థితి ఎలా కనబడుతుంది: కోన తాతారావు

గాజువాక, రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల మయము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళకు గంతల మయం. జనసేన మరియు టిడిపి పార్టీల ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్వహణలో వైపల్యం వలన అవి నరకానికి నకళ్లుగా మారిన తీరుని జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు, విశాఖ అర్బన్ సమన్వయకర్త, గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ కోన తాతారావు ఎండగట్టారు. విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అన్నీ హెలిక్యాప్టర్లోనే! రోడ్లు మీద తిరిగితే రోడ్లు అద్వాన దుస్థితి, వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయని తెలిపారు. శనివారం జనసేన మరియు టిడిపి ఆధ్వర్యంలో గుంతల మయమైన గాజువాక బీసీ రోడ్డును యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని మహా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ వార్సిక బడ్జెట్ లో రోడ్లు నిర్వహణకు 428కోట్లు కేటాయించారు అవి ఎటో వెళుతున్నాయో అర్ధంకానీ పరిస్థితి, మరొక పక్క వైసిపి ఎంపీ వెంచర్లుకు, స్థానిక ఎమ్మెల్యే ఇళ్ల దగ్గర, వారి అనుచరులు లేఔట్లు దగ్గర రోడ్లుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రజలు నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ము ప్రజా అవసరాలకి ఖర్చు చేయకపోవటాన్ని తీవ్రంగా కండించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని, అరాచకాలపై ప్రజలు తరుపున గొంతెత్తున్న ప్రతిపక్ష నాయుకులను అక్రమంగా అరెస్టుల ఉన్న శ్రద్ద ప్రమాదాలకు కారణమవుతున్న అద్వానంతో ఛిద్రమైన రోడ్లునిర్వహణలో చూపే అశ్రద్ధ ఎన్నో కుటుంబాలు బలి అయ్యాయని,రోడ్లు నిర్మించలేని చేతగాని ఈ ప్రభుత్వం త్వరలో ఇంటిదారి పడుతుందన్నారు. అందుకనే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రధాన రహదారులు యుద్ధ పాతిపదిక నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అభివృద్ధి చేయకుండా, ఈ రాష్ట్ర సంపదను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ నాయకులు దోచుకు తింటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యదర్శి గడసల అప్పారావు, జనసేన రాష్ట్ర నాయకులు తిప్పల రమణారెడ్డి, గాజువాక నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కార్పొరేటర్ బోండా జగన్, జీవీఎంసీ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జనసేన డిప్యూటీ ప్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి, 67 వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 79 వార్డ్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, 75 వ వార్డు ఇంచార్జ్ పులి వెంకటరమణారెడ్డి, జనసేన నాయకుల గంధం వెంకటరావు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, అధిక సంఖ్యలో జనసేన మరియు టిడిపి నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.