హుజూరాబాద్, బద్వేల్ కౌంటింగ్ కౌంట్ డౌన్.. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర…

మంగళవారం హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేలనుంది.  విజయం పార్టీలు ధీమాగా ఉన్నా ఓటర్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక మినీ యుద్ధాన్నే తలపించింది. నేతల మాటల యుద్ధంతో మొదలైన ఎన్నికల ప్రచారాలు… ముష్టిఘాతాలతో ముగిశాయి. ప్రలోభాలు, తాయిలాలు, పథకాలు, బుజ్జగింపులు ఇలా సాధారణ ఎన్నికలను తలపించేలా హుజూరాబాద్ ఉపఎన్నిక హోరెత్తింది. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.