నేను మెగా ఫ్యామిలీకి ఏకలవ్య శిష్యుడిని: బొర్రా

సత్తెనపల్లి, బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జనసేన- తెలుగుదేశం సంకల్ప యాత్రను పోలీసులు అడ్డుకున్న క్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ మాకు డబ్బులతో పనిలేదు. ప్రేమాభిమానాలతోనే జనసైనికులు, వీర మహిళలు పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ సభ పెడితే 60, 70 వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఎదవలు, ఎదవ మాటలు మాట్లాడతారు. ప్రతిదానికి డబ్బుతో ముడి పెట్టకూడదు. వైసీపీ వాళ్లు సభలో పెడితే జనాన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుచ్చుకోవాలి. వైయస్సార్సీపీ వాళ్లు మూర్ఖులు ఉన్నారు మూర్ఖులని ప్రపంచానికి తెలిసిపోయింది. కోర్టు ద్వారా మోట్టికాయలు వేయించుకోంది. ఏ వ్యవహారం జరగదు. మేము ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేస్తున్నాను. పర్మిషన్ ఇస్తే పాదయాత్రకి వెళ్తావ్. లేదంటే మోట్టి కాయలు వేస్తేనే వీళ్ళు వింటారు కాబట్టి కోర్టుకు వెళతాం. ఈ సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ.. నేను ఊహ తెలిసిన దగ్గర్నుంచి మెగా ఫ్యామిలీకి అభిమానిగా ఉన్నాను. 2008 నుండే ప్రజారాజ్యంలో నా ఇంటిపై ప్రజారాజ్యం జెండా పెట్టుకొని పని చేస్తున్నాను. తల్లి లాంటి నా మెగా కుటుంబంతో నాకు అనుబంధం ఈనాటిది కాదు. నేను ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ద్రోణాచార్యుడు లాంటి గురువు పవన్ కళ్యాణ్, నేను ఏకలవ్య శిష్యుడిలా జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. నేను మెగాఫ్యామిలీకి ఏకలవ్య శిష్యుడిని, నాకు ఎవరూ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఎవరూ ఏ పదవి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరు రికమండేషన్ లు నాకు అవసరం లేదు. మెగాఫ్యామిలీ నుండి అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ వారి నోటి నుండి వచ్చే మాటలు నాకు శిరోధార్యం. పనిచేయటం నా లక్ష్యం ఫలితం ఇవ్వటం మెగా ఫ్యామిలీ ఇష్టం.పవన్ కళ్యాణ్ ను ప్యాకేజి స్టార్, మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు అంటూ ఇక్కడి మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. అంబటి నువ్వు వైసీపీ కుటుంబానికి వీరాభిమానివైతే నేను మెగా ఫ్యామిలీకి వీరాభిమానిని, పవన్ కళ్యాణ్ ను పదే పదే విమర్శిస్తే నేను సత్తెనపల్లి నుండి నీ మీద దండ యాత్రగా వస్తాను. ఈ జిల్లాలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా మెగా ఫ్యామిలీ జోలికొస్తే బొర్రా వెంకట అప్పారావు అనే ఏకలవ్య శిష్యుడు ఉన్నాడని వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోండి. మెగా ఫ్యామిలీపై నాకున్న అభిమానాన్ని తీసేయాలంటే ఏకలవ్యుడుకి బొటన వేలు తీసేసారు, నాకు నా ప్రాణం తీయాలి. నేను గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ తిరుగుతుంటే నాకు వైసీపీ వాళ్ళ నుండి ప్రాణహాని ఉందని పోలీసులు అంటున్నారు. నాకు జనసేన వీరమహిళలు, జనసైనికులు, మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానుల అండగా ఉన్నారు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను సత్తెనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి తీరుతాను. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, జనసేన పార్టీ లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ బయ్యవరపు నరసింహారావు, జనసేన సత్తెనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, సత్తెనపల్లి జనసేన సీనియర్ నాయకులు కొమ్మిశెట్టి అర్జునరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, 7 వార్డ్ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, వినుకొండ జనసేన నాయకులు వెంకటేశ్వర్లు, నరేంద్ర, పూర్ణ చంద్రరావు, ఫిరంగిపురం జనసేన నాయకులు గుగ్గిళం సురేష్, రఫీ, గౌస్, తిలక్, చిలకా సత్యం, చిలకా పూర్ణ, శివ, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.