చెప్పులతో జవాబు చెప్పగలం.. కానీ అది మా సంస్కారం కాదు: కిరణ్ రాయల్

మంత్రుల స్థాయిలో ఉండి మీరు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి పై నోరు జారితే.. జనసైనికులుగా, వీరమహిళలు గా మేము చెప్పులతో, చేటలతో మీకు జవాబు చెప్పగలం కానీ మా సంస్కారం అది కాదు అని తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ మండి పడ్డారు. పోలవరం పూర్తి చేయాలంటే పోలవరానికి పేరు “సంజనా, సుకన్య” అని పెడితే గంట, అరగంటలో పూర్తి చేస్తారెమోనని ఎద్దేవా చేశారు.