తిరుపతిలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలను, అరాచకాలను తీవ్రంగా ఖండిస్తూ జనసేన నిరసన
తిరుపతి, కీలక పదవిలో ఉన్న వైసిపి నాయకుడు వారి అనుచరులతో కలిసి గత అర్ధరాత్రి జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ గురువారం గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి, మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.హరి ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు మీ సభ్యులకు జనాలను డబ్బులు ఇచ్చి తీసుకురావాలి, అదే మా సభలకు వచ్చిన జనాలను మీరు పోలీసులను పెట్టి మరీ అదుపు చేయాలి, కావున వైసిపి నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులకు పాల్పడినట్లు అయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అని అన్నారు. అదేవిధంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. ఒంటరిగా ఉన్న వారి మీద మూకుమ్మడిగా దాడి చేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మరొక్కసారి రండి ఖబర్దార్ చూసుకుందాం అని దాడులకు పాల్పడిన వైసిపి వారిని హెచ్చరించారు.