శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాను: డా.మాధవరెడ్డి

తెలంగాణ, శేరిలింగంపల్లి, ఆదివారం స్థానిక చందానగర్ రైల్వేస్టేషన్ నుండి జనసేన పార్టీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా.మాధవ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ విడత పాదయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో రాష్ట్ర విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ హాజరై వారి మద్దతును తెలియజేయడం జరిగింది. మరియు వీరితోపాటు జనసేన పార్టీ నాయకులు, సభ్యులు, జనసేన వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా.మాధవరెడ్డి మాట్లాడుతూ నా ఈ పాదయాత్రకు ఇంతలా సహకరిస్తున్న జనసైనికులు, వీరమహిళలు, ప్రజలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, స్థానిక చందానగర్ ప్రజానికానికి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. పాదయాత్రలో ప్రజల నుంచి వెలువడుతున్నటువంటి సమస్యలను తెలుసుకున్నటువంటి మాధవ రెడ్డి ఈ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామన్నారు. అయితే ఈ పాదయాత్రల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మరియు అదే విధంగా అధికార మార్పిడి బలంగా కోరుకుంటున్నారని స్పష్టంగా తెలియడం జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున యువత, విద్యావంతులు, సీనియర్ సిటిజెన్సు మరియు మేధావులు ఎంతో మంది కూడా వారి వారి సమస్యలని తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ నాయకత్వంలో రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ డివిజన్, భాగ్యనగరంలోనే అత్యున్నతమైన, అత్యద్భుతంగా అభివృద్ధిని చేస్తామని అన్నారు. ప్రభుత్వ భూములనీ, ప్రభుత్వ చెరువులను కబ్జ్బా అవకుండా నివారించి, డివిజన్లోని పిల్లలకు, వృద్ధులకు సైతం కావల్సిన ఆటల స్థలాలను మరియు సేదతీరేందుకు వీలుగాను, పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా పార్కులను ఏర్పాటు చేస్తానని, అదే విధంగా డివిజన్లోని మురికి వాడల పిల్లలకు, ప్రాధమిక విద్యను నేర్పేందుకు ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వోకేషనల్ కళాశాలలను ఏర్పాటు చేస్తానన్నారు. రోజు వారి అడ్డ కూలీలకు గద్దర్ అన్న ఉచిత ఆహార క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. డివిజన్ లోని చిట్ట చివరి పౌరుడు, చిట్ట చివర వరకు కనీస సదుపాయాల కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అందేలా కృషి చేస్తానని మరియు మధ్యతరగతి ప్రజల కోసం సైతం తగిన వసతులను కల్పించి, భాగ్యనగరంలోనే అత్యంత హంగులతో చందానగర్ డివిజన్‌ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.