కూకట్పల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం మరియు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్యఅతిథిగా ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర జనసేన పార్టీ మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా క్రియాశీల సభ్యత కిట్ల పంపిణీ జరిగినది. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ 32 స్థానాలు పోటీ చేస్తున్నామని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవసరమయితే ఇంకొన్ని స్థానాలు పెంచుతామని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 27 బిసి కులాలను తీసివేసిందని వారిని వెంటనే బిసి కులాలలో కలపాలని లేనిచో ఉద్యమం తప్పదని, ఎస్సీ మరియు బీసీ బందు అంటూ బడుగు బడుగు బలహీన ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని కేవలం తమ చుట్టూ ఉన్న వారికి మాత్రమే ఆ పథకం ఉపయోగపడుతుందని, డబుల్ బెడ్ రూమ్ అంటూ పేదలను మోసం చేస్తున్నారని, ఈ మధ్య కూకట్పల్లి, కేపిహెచ్బి మెట్రో స్టేషన్ పక్కన ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదమై వేలాదిమంది నడిచే ఆ ప్రదేశంలో ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అగ్ని ప్రమాదాలు జరిగాయని కొన్ని చోట్ల ప్రాణ నష్టాం మరియు ధన నష్టం జరిగిందని, భద్రతా నిబంధనలు లేకుండా పర్మిషన్లు ఇస్తున్న సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్య తీసుకుని పనికిరాని ప్రభుత్వం మనల్ని పాలిస్తుందని అన్నారు. తాను కూకట్పల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు మంచినీటి సమస్య గురించి, రోడ్ల సమస్య గురించి మరియు నాలాల వల్ల దుర్వాసన వస్తుందని తమ ఆరోగ్యం పాడవుతుందని తమని ఏ అధికారులు గాని పాలిస్తున్న నాయకులు గాని పట్టించుకోవట్లేదు అని తనకు చెప్పి వాపోయారని అన్నారు అలాగే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను స్వయంగా పోటీ చేస్తానని వెల్లడించారు. ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్, దామోదర్ రెడ్డి, నందగిరి సతీష్, యడమ రాజేష్, మండలి దయాకర్ , లక్ష్మణ్ రావు, వీర మహిళా నాయకురాలు కావ్య మండపాక, రత్న పిల్ల, కూకట్పల్లి నియోజకవర్గం కో-ఆర్డినేటర్లు వేముల మహేష్, కొల్లా శంకర్, నాగేంద్ర, కిషోర్ నాగరాజు, వెంకటేశ్వరరావు మరియు డివిజన్ ప్రెసిడెంట్లు సాలాది శంకర్, కలిగినిడి ప్రసాద్, పండు సూర్య, జెన్నీ సునీల్, ఎస్.కె నాగూర్, లింగరాజు, జనరల్ సెక్రెటరీలు మరియు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొనడం జరిగినది.