ఇచ్చాపురం జనసేన శాంతియుత పోరాటానికి సిద్ధం: దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం, మున్సిపాలిటీలో బెల్లిపడ గ్రామానికి భాహుధానది ఎడమ కాలువ గట్టు వల్ల ప్రతి సంవత్సరం 1800 ఎకరాల పంట పొలాలు వరద ముంపుకు గురవుతున్నాయి. ఈ సమస్యని జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజుని అక్కడ రైతులు, గ్రామస్తులు సంప్రదించడం జరిగింది. కాలువ గట్టుని సందర్శించిన దాసరి రాజుకి రైతులు గత 8 సంవత్సరాలుగా పంట నష్టం, దాని వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలవుతున్నామని, రాజకీయ నాయకులు గాని స్థానిక అధికారులు గాని పట్టించుకోలేదు. కలెక్టర్ దృష్టికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకూ మా సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి. గత ప్రభుత్వం గాని ఇప్పుడున్న ప్రభుత్వం గాని మా సమస్యను పరిష్కరించడం లేదు అని తెలిపారు. ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజుని అక్కడ రైతులు గ్రామస్తులు కలిసి వాళ్లు బాధలను విన్నవించుకున్నారు. రైతుల బాధలు విన్న దాసరి రాజు మీ సమస్యలను పత్రికా ముఖంగా అధికారుల దృష్టికి తెలియజేస్తున్నాను. ఏదైతే ఎనిమిదేళ్లుగా రైతులు పడుతున్న బాధ.. తక్షణమే ఈ గట్టుని నిర్మించి రైతులకు న్యాయం చేయాలని లేనియెడల రైతులు మద్దతుతో ఇచ్చాపురం జనసేన పార్టీ శాంతియుతంగా పోరాటానికి సిద్ధం అవుతోంది. కావున అధికారులు వెంటనే ఈ సమస్యకు స్పందించి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ పెద్దలు మున్సిపాలిటీ ఇన్చార్జులు శేఖర్, భాస్కర్, సంతోష్, కలియ, జనసైనికులు కామేష్, పద్మనాభం, యాదవ్ రెడ్డి, సింహాచలం, మోహన్, గౌతం, అజయ్, చంటి, రాజు, వెంకటేష్, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.