ప్రజలు సంతోషంగా ఉండాలంటే జనసేన అధికారంలోకి రావాలి: గురాన అయ్యలు

విజయనగరం, ప్రజలు సంతోషంగా ఉండాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు అన్నారు. మంగళవారం గురాన అయ్యలు సమక్షంలో విజయనగరం పట్టణంలోని 1, 7, 12, 15, 18, 47 వార్డులకు చెందిన పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, దోపిడీ విధానాలపై పోరాటం చేయడానికే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారన్నారు. జనసేనకు యువత అండగా నిలబడడం అభినందనీయమన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారు పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతాలు, ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్టీలో చేరినవారిలో వై.సురేష్‌, పి.వెంకటరావు, ఎస్‌.కె.మలానా, ఆర్‌.లోకేష్‌, ఆర్‌.అచ్యుత్‌, ఎన్‌.అనిల్‌ కుమార్‌, బాబు, ఎన్‌.వెంకటేష్‌, కె.హర్షవర్ధన్‌, హుస్సేన్‌, ఎన్‌.శేఖర్‌, కళ్యాణ్‌, జి.కిరణ్‌, టి.గోపి, కె.శ్రీకాంత్‌, సాయిదత్‌, జి.అరుణ్‌, రమేష్‌, జి.కుమార్‌, పి.సురేష్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఎంటి రాజేష్‌, ఎం.పవన్‌కుమార్‌, అరవింద్‌కుమార్‌, వెంకటేష్‌, అయ్యప్ప, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.