బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడాలి: బొర్రా

  • ఘనంగా బీసీల ఆత్మీయ సమావేశం
  • బీసీలంటేనే ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదు.
  • బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు. బ్యాక్ బోన్ క్లాస్.
  • బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాళ్ల మండలం, సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి భారీగా జనసేన పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ బీసీలకు ఇన్ని ఇచ్చాం. ఇన్ని పదవులిచ్చాం అని అధికార పార్టీ చెప్పుకుంటుంది. బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహీ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది..? బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలం. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత. పూలేను గౌరవించింది మనమే. బీసీ సదస్సు అంటే ఇంతమంది వచ్చారు. కానీ బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? బీసీల కోసం జనసేన అండగా నిలబడుతుంది అని బొర్రా అన్నారు.బీసీలను అణగదొక్కుతున్నారని, కార్పొరేషన్ల వల్ల తమకెలాంటి లాభం లేదని, కార్పొరేషన్ల పేరుతో బీసీలను ప్రభుత్వం విడదీయాలని చూస్తోందని, వారిలో ఐక్యత లేకుండా చేసి వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని బొర్రా విమర్శించారు. ఖాళీ కుర్చీలు తప్ప కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. బీసీలు దేశ ఆర్థికరంగానికి వారి కులవృత్తుల ద్వారా వెన్నుదన్నుగా ఉన్నారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బీసీ జనగణన విషయంలో బీసీలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బొర్రా అన్నారు.బీసీలు దేశ ఆర్థికరంగానికి వారి కులవృత్తుల ద్వారా వెన్నుదన్నుగా ఉన్నారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బీసీ జనగణన విషయంలో బీసీలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బొర్రా అన్నారు. బీసీలు దేశ ఆర్థికరంగానికి వారి కులవృత్తుల ద్వారా వెన్నుదన్నుగా ఉన్నారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బీసీ జనగణన విషయంలో బీసీలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బొర్రా అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ కులగణన జరిపి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు దక్కాల్సిన అవకాశాలను కల్పించాలి. ఇప్పటికీ బీసీలు వెనుకబడిన వర్గాలుగానే మిగిలిపోవడానికి కారణం ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం.బీసీలందరు ఏకం కావాలి. బీసీలంతా ఒకే గొంతుకతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని జనసేన పార్టీ పిలుపునిస్తుంది.లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం అంశం, బీసీలపై కపట ప్రేమను వలక బోస్తుంది వైసీపీ.ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. మళ్ళీ ఐదేండ్ల తర్వాత ఏదో ఒక ఆశ చూపి ఓట్లు దండుకుంతుంది వైసీపీ. కాబట్టి వైసీపీ చేస్తున్న అరాచలకు చెక్ పెట్టాలంటే జనసేన – టీడీపీలు అధికారంలోకి రావాలని నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు అన్నారు. అనంతరం సత్తెనపల్లి రూరల్ బృగుబండ గ్రామానికి సంబంధించి పది బీసీ కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పించుకొని పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజనల్ కో-ఆర్డినేట్ పార్వతి నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, బీసీ నాయకులు ముప్పాన వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు యామా మురళి గౌడ్, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, కుమ్మరి ఏడుకొండలు, సత్తెనపల్లి మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తెనపల్లి మున్సిపల్ ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, టిడిపి నేతలు జి.శ్రీనివాసరావు, లోకేశ్వరరావు, జన సైనికులు, వీర మహిళలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.