చేతకాదని ప్రభుత్వం తెలిపితే, గ్రామ ప్రజలతో కలిసి జనసేన పార్టీ రోడ్లు వేస్తాం – బండారు శ్రీనివాస్

కొత్తపేట మండలం అవిడి గ్రామంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రోడ్లు మరీ చిద్రంగా తయారయ్యాయి. రోడ్లు పరిస్థితిని పరిశీలించిన కొత్తపేట జనసేన పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి శ్రీ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ అవిడ గ్రామం లో ఎం పి పి యు పి స్కూల్ దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ ఆనుకుని ఉన్న రోడ్డుపై విద్యార్థులు స్కూలుకు రావటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతేకాక రోడ్డు అనుకునే వేలాది ఎకరాలు సాగు జరుగుతుందని తెల్లవారితే గ్రామంలోని రైతులందరూ ఈ రోడ్డు మీదుగా పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితని తెలిపారు. ఎక్కడ చూసినా గోతులతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని స్థానిక శాసనసభ్యులుకి 3 నెలల క్రితం మెమొరాండం కూడా ఇవ్వడం జరిగిందని కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని పది రోజుల్లో రోడ్లు బాగు చేయాలని కనీసం ప్యాచ్ వర్క్ అయినా పూర్తి చేయాలని తెలిపారు. మాకు చేతకాదు అని ప్రభుత్వం తెలిపితే, గ్రామ ప్రజలతో కలిసి జనసేన పార్టీ రోడ్లు వేస్తామని తెలిపారు.