మేం అధికారంలోకి వస్తే దేవాదాయశాఖను రద్దు చేస్తాం: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన కామెంట్ చేశారు. ఏపీలో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాదాయశాఖను రద్దు చేస్తామని చెప్పారు. దేవాలయాల బాధ్యతను ప్రముఖ సంస్థలకు అప్పగిస్తామని చెప్పారు. నిన్న కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు ఇచ్చే సిఫారసు పత్రాలతోనే తిరుమల కొండ నిండిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యుల్లో పలువురు కళంకితులు ఉన్నారని సోము వీర్రాజు ఆరోపించారు.