అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలంటే.. అది జనసేనాని వల్లే సాధ్యం: కరిమజ్జి

*ఇంటింటికి మన జనసేన పార్టీ కార్యక్రమం 73 వ రోజు

*చెరువుల పూడికతీతల పనుల్లో ఉన్న రైతాంగాన్ని, కార్మికులను కలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించిన కరిమజ్జి మల్లీశ్వారావు

జె.ఏస్.పి శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, పతివాడపాలెం గ్రామం.. బుధవారం పి.ఏ.సి.ఎస్ మాజీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లానేత, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు పతివాడపాలెం గ్రామ చెరువుల్లో పూడికతితలు తీస్తున్న రైతు కుటుంబాలను, కార్మిక కుటుంబాలను కలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను వివరించడం జరిగింది. లక్షల కోట్ల రూపాయిలు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటే.. అధి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని.. నిబద్ధత, నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యాల్సిన బాధ్యత ప్రజలదని అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, వైస్సార్ కాంగ్రేస్ పార్టీకి అధికారమిచ్చాము, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మనమిదే ఉందని అన్నారు. ఆరు కోట్ల మంది ఆంధ్రుల జీవితాలకు మంచిచెయ్యాలనే సంకల్పమున్న ఏకైక నాయకుడు పవనన్న అని తెలియజేశారు, చెరువుపనుల్లో ఉన్న రైతులు, రైతుకూలీలు, విశేష స్పందనతో కరిమజ్జి మల్లీశ్వారావు కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.