జగనన్న కాలనీలో 100 కు ఒకటి కట్టి గొప్పలు చెప్పుకుంటే 99 సంగతేంటి..? : వాసగిరి మణికంఠ

గుంతకల్ జగనన్న కాలనీల పేరట ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ అధ్యక్షతన మరియు రాయలసీమ కమిటీ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పద్మక్క, పెండ్యాల శ్రీలత, జిల్లా కార్యదర్శి సంజీవ రాయుడు, నిస్వార్థ జనసైనికులు, నాయకుల పర్యవేక్షణలో “జగనన్న ఇల్లు- పేదలందరికీ కన్నీళ్లు” అనే కార్యక్రమం ద్వారా పామిడి మండలంలో గల జగనన్న కాలనీ, టిడ్కో ఇళ్ళ సముదాయాలను సామాజిక పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట పేదలందరికీ రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఐదు శాతం ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు. భూసేకరణ పేరుతో దోపిడీ, రాష్ట్రవ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ 10 నుంచి రూ 20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని 70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూ 23,500 వందల కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి. అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు అనేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ గొప్పలు చెప్పే ఈ ప్రభుత్వంకు ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చింది, పేదలను ఎందుకింత దగా చేస్తున్నారు, ప్రజలకు ఈ వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ప్రధానంగా డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టిక్కో ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియని పరిస్థితి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు, వీర మహిళలు శ్రీమతి వాణి, శ్రీమతి కుల్లాయమ్మ, శ్రీమతి ధార్బి, శ్రీమతి శైలజ, శ్రీమతి శారద, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి అనసూయ, నాయకులు రాజశేఖర్, పూజారి పవన్, వన్నూరు, ఉత్తేజ్ మరియు గుంతకల్ జనసైనికులు పామయ్య, అనిల్ కుమార్, రామకృష్ణ, అమర్ పామిడి మండల ఉపాధ్యక్షులు టి రాజశేఖర్, శరత్ బాబు పామిడి మండల ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ పామిడి మండల కార్యదర్శి ధనుంజయ, లాలు స్వామి, పెన్నా, ఖాజావలి, రోషన్ జమీర్ మండల సంయుక్త కార్యదర్శి పారా సురేష్, భాస్కర్, రంగా, గంగాధర్, ధన, అఫ్జల్, మురళి, మహమ్మద్ హబీబ్, మనీంద్ర, ఎస్.గంగాధర్, జాఫర్ వలి ఇంకా జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.