మీరు చేయలేకపోతే చెప్పండి.. మేము చేసి చూపిస్తాం: చిల్లపల్లి శ్రీనివాసరావు

  • పాడి రైతులకు అండగా జనసేన

మంగళగిరి: తాడేపల్లి మండలం, చిర్రావూరు గ్రామంలో వాటర్ ట్యాంకు సెంటర్ లో జనసేన పార్టీ తరఫున తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు మరియు చిర్రావూరు గ్రామ అధ్యక్షులు అంకం ఖాళీ కృష్ణ ఆధ్వర్యంలో 13 ఏళ్ల నుండి పూర్తి చేయని పశువుల హాస్పిటల్ ను వెంటనే పూర్తి చేయాలని, పశువుల డాక్టర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ఉన్న పాడి రైతులతో కలిసి వారికి అండగా నిరసన తెలుపుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయటం జరిగింది. సోమవారం సాయంత్రం జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి మారుతీ రావు పాడి రైతుల కోసం చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలియజేసి, అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించారు. అనంతరం చిర్రావూరు గ్రామంలో 13 ఏళ్ల నుండి పూర్తి చేయని పశువుల హాస్పిటల్ ను పరిశీలించి, పాడి రైతులను కలిసి వారి సమస్యలను మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిర్రావూరు గ్రామంలో ఈ రోజున పాడి రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగిందని, దాదాపుగా తాడేపల్లి మండలం, చిర్రావూరు గ్రామంలోని గేదెలకు టోకెన్లు వేసినవే 1500 పైచిలుకు ఉన్నాయి. మనం రోజు ఉపయోగించే పాలు ఉత్పత్తి చేసే పాడి రైతులకు ఎటువంటి సౌకర్యాలు కానీ, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగాని కల్పించకుండా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేమంతు సీఎం ఇంటికి కోత వేటు దూరంలో ఉన్న చిర్రావూరు గ్రామంలో ఉన్న పాడి రైతులనే పట్టించుకోకుండా బటన్లు నొక్కేమంటూ ఈ వైసిపి ప్రభుత్వం వారు ప్రచారం చేసుకోవడం తప్ప రాష్ట్ర భవిష్యత్తు పట్టించుకునేదే లేదు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 13 ఏళ్ల నుండి పూర్తి చేయని పశువుల హాస్పిటల్ ను పూర్తిచేసి డాక్టర్ ను నియమించి రైతులు పడుతున్న సమస్యలను తొలగించి రైతుల పక్షాన నిలబడాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. 2,3 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వెన్నమంచుకుంటున్న పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో ఈ సమస్య గురించి పోరాడిన పట్టించుకోలేదని మీరు చేయలేకపోతే చెప్పండి జనసేన ప్రభుత్వం వచ్చినాక మేము చేసి చూపిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు శెట్టి రామకృష్ణ, ఎంటిఎంసీ సమన్వయకర్త తిరుమలశెట్టి కొండలరావు, ఎంటిఎంసీ కమిటీ సభ్యులు, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి లాల్ చంద్, చిర్రావూరు గ్రామ ఉపాధ్యక్షులు అడప విజయ్, తాడేపల్లి మండల కమిటీ సభ్యులు, చిర్రావూరు గ్రామ పాడి రైతులు, చిర్రావూరు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

: