యాత్రకు అనుమతులు వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం

  • 4వ రోజు కూడా కొనసాగిన రిలే నిరాహార దీక్ష

సత్తెనపల్లి, జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ నేత బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జనసేన-తెలుగుదేశం సంకల్ప పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న క్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నాల్గవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రిలే నిరాహార దీక్షలో జనసైనికులు పాల్గొనడం జరిగింది. శాంతియుతంగా సాగే ఈ సంకల్ప యాత్రకు ఇక్కడి స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వని పక్షంలో కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకొని సంకల్ప యాత్రను కొనసాగిస్తామని, అనుమతులు వచ్చే వరకు వరకు ఈ రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు అన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి అంపిరాయని కళ్యాణ రాజేశ్వరి, సత్తెనపల్లి 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, చిలక పూర్ణ, మహాలక్ష్మి, శ్రీను, రవికిరణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.